నటుడు వెంక‌టేష్‌ కూతురు ఆశ్రిత మ్యారేజ్ గురించి రకరకాల వార్తలు హంగామా చేస్తున్నాయి. దీనిపై ద‌గ్గుబాటి ఫ్యామిలీ ఏ మాత్రం స్పందించ‌డంలేదు. తాజాగా ఆశ్రిత వివాహం రాజ‌స్థాన్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్నట్టు సమాచారం. డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కు క్లోజ్‌ఫ్రెండ్స్, ఇరు ఫ్యామిలీల బంధువులు మాత్రమే హాజ‌రుకానున్నార‌ని తెలుస్తోంది. ఈ వారంలో ఆశ్రిత్ర, వినాయ‌క్‌ల పెళ్లి జ‌ర‌గ‌నుందని, ఇప్పటికే ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయ‌ని అంటున్నారు. అలాగే వివాహానికి ముందు జ‌రిగే సంగీత్ ఫంక్షన్‌లో రానా, నాగ‌చైత‌న్య- స‌మంత స్పెష‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్ ఇవ్వనున్నార‌ని ఇన్‌సైడ్ సమాచారం. ఫిబ్రవ‌రిలో ఆశ్రిత ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్‌రెడ్డి మనవ‌డు వినాయ‌క్ రెడ్డితో జరిగిన విషయం తెల్సిందే!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *