ప్రముఖ బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ కన్ను మూశారు. ఆయన వయస్సు 95 ఏళ్ళు. ఆదివారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. వయోభారం కారణంగా తలెత్తిన ఆరోగ్య సమస్యలతో మృణాల్ సేన్ మృతి చెందారని కుటుంబ వర్గాలు తెలిపాయి. 1923 మే 14‌న బంగ్లాదేశ్ లోని ఫరీద్ పూర్‌లో జన్మించిన ఆయన..1955 లో దర్శకుడిగా సినీ రంగంలో ప్రవేశించారు.

‘భువన్ షోమ్’  , ‘మృగయా’  వంటి సృజనాత్మక  చిత్రాలను తెరకెక్కించిన మృణాల్ సేన్‌ను పలు జాతీయ అవార్డులు వరించాయి. 1983‌లో పద్మ భూషణ్ అవార్డును, 2005 లో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ప్రపంచ సినిమా స్థాయికి బెంగాలీ సినిమాను తీసుకెళ్ళిన ఆయన మృతితో బెంగాలీ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *