విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ టీజర్ నాలుగు భాషల్లో విడుదలైంది. ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో మొత్తం సౌత్ మార్కెట్ క్యాప్చర్ చేసే పనిలో ఉన్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ మూవీపాటు ‘హీరో’ అనే మరో చిత్రాన్ని కూడా తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు కన్నడంలోనూ రిలీజ్ చేయనున్నాడు.

విజయ్ దేవరకొండకి తెలుగు, తమిళ భాషల్లో మంచి మార్కెట్ ఉంది. ఇక ఇపుడు కన్నడ, మలయాళ భాషల్లోనూ ఎంతోకొంత ఫాలోయింగ్ పొందితే.. సౌత్‌లో అన్ని లాంగ్వేజెస్‌లోనూ తన సినిమాలను రిలీజ్ చేయొచ్చనేది విజయ్ ఆలోచన. తన సినిమాలకి మరింతగా మార్కెట్ పెంచుకునేందుకు ఇలా స్కెచ్ వేశాడు.

ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఈ పంథాలో వెళ్తున్నాడు. బన్నీకి ‘సదరన్ స్టార్’ అనే ట్యాగ్ కూడా ఉంది. అంటే విజయ్ దేవరకొండ.. బన్నీకి ఈ విషయంలో పోటీ ఇస్తున్నాడన్నమాట.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *