రామ్ గోపాల్ వర్మ మళ్ళీ దూకుడు పెంచేశారు. ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ మూవీ విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేయడంతో ఈ పదిరోజుల్లో వీలైనంత ఎక్కువ ప్రమోషన్ పొందేలా ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే రెండు పాటలు, రెండు ట్రైలర్లు విడుదల చేసి.. సినీ-పొలిటికల్ సర్కిల్స్‌లో కలకలం సృష్టించిన వర్మ.. మరో సాంగ్ బిట్‌ని మీడియాలో వదిలారు. ‘విజయం.. విజయం.. శుభ సమయం’ అనే బ్యాక్‌డ్రాప్ లీడ్‌తో సాగే ఈ పాటలో.. ఎన్టీయార్-లక్ష్మిపార్వతిల అన్యోన్య దాంపత్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపెట్టే ప్రయత్నం జరిగింది. మధ్యమధ్యలో మూడు ప్రధాన పాత్రలతో చెప్పించిన కొన్ని కీలక డైలాగుల్ని కూడా జొప్పించాడు డైరెక్టర్ వర్మ. హృద్యంగా, మంచి మెలోడియస్ మూడ్‌తో సాగే ఈ పాటను ఎస్పీ బాలసుబ్రమణ్యం, భోగరాజు పాడారు. యజ్ఞశెట్టి లక్ష్మీపార్వతిగా నటిస్తున్న ఈ మూవీకి కళ్యాణి మాలిక్ మ్యూజిక్ అందించారు. వర్మతో పాటు అగస్త్య మంజు లైన్ డైరెక్టర్‌గా చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *