ఛత్తీస్ గడ్ లోని ఓ కుగ్రామం వార్తలకెక్కింది. తమను సదా రక్షించేదిగా, తాము పూజించే మొసలి చనిపోవడంతో ఆ గ్రామమంతా కన్నీరుమున్నీరైంది. ఆమొసలి మృతదేహాన్ని గ్రామమంతా ఊరేగించి దానికి అంత్య క్రియలు నిర్వహించారు గ్రామస్తులు. వివరాల్లోకి వెళ్తే.. బెమెటారా జిల్లాలోని ‘ బవా మొహ్తారా ‘ అనే గ్రామమది.. అక్కడి ఓ చెరువులో దాదాపు వంద సంవత్సరాల నుంచి ఉంటోందని చెబుతున్న భారీ మొసలి ఈ నెల 8 న మరణించింది. దీన్నిఆప్యాయంగా, భక్తిపూర్వకంగా ‘ గంగారామ్ ‘ అని పిలుచుకునేవారమని, పూజలు కూడా చేసేవారమని ఆ గ్రామ సర్పంచ్ సాహు చెప్పాడు.

దీని వయస్సు సుమారు 140 ఏళ్ళు ఉంటుందని భావిస్తున్నామని, ఇది మరణించిన రోజున సంతాప సూచనగా గ్రామంలో ఎవరూ వంటలు కూడా చేసుకోలేదని ఆయన తెలిపాడు. ‘ ఇది ఎప్పుడూ, ఎవరికీ హాని చేయలేదు. చిన్న పిల్లలు ఈ మొసలి ఉన్న చెరువులో నిర్భయంగా ఈత కొట్టేవారు. అలాగే పెద్దవాళ్ళు కూడా.. ఇన్నేళ్ళుగా ఈ చెరువులో ఉంటున్న ఈ ‘ గంగారామ్ ‘ మృతి చెందడం ఎంతో బాధాకరం.. ఈ చెరువు ఒడ్డునే దీని స్మృతి మందిరం నిర్మిస్తాం ‘ అని సాహు గద్గదికంగా చెప్పాడు.

100 year old crocodile Gangaram dies, whole village cried in the last farewell in Baba Mohtara village of #Chattisgarh.. **********#Ganga Ram, the crocodile, passed away & everyone cried. He lived in a pond, villagers worshipped him. They said he was 100-yr-old. After death, corpse was taken around on tractor, gulal applied on forehead. "He never attacked anyone who took dip in the pond", said an elderly man.Surprising thing is, Villagers used to feed it with Dal, Roti & Rice too…….. !

Posted by Syed Saleem on Wednesday, January 9, 2019

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *