వినయ విధేయ రాముడి వదినలు బుల్లితెరపై సందడిచేశారు. సినిమాలో నటించేందుకు ఎలా అవకాశం వచ్చింది? సినిమా గురించి.. షూటింగ్ సమయంలోని ఇన్సిడెంట్స్, రామ్ చరణ్, మిగతా కో స్టార్స్ తో ఉన్న మధురానుభూతుల్ని ఈ సందర్భంగా నలుగురూ గుర్తు చేసుకున్నారు. వాళ్ల మాటలేంటో ఈ వీడియోలో..

ఇదిలాఉంటే, రిలీజ్ రోజున నెగిటివ్ రివ్యూలు, డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ‘వినయ విధేయ రామ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా మాత్రం డీసెంట్ గా ముందుకెళ్తోంది. బోయపాటి శ్రీను డైరెక్షన్లో సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుద‌లైన ఈ సినిమా ఐదో రోజున తెలుగు రాష్ట్రాల్లో రూ.5.24 కోట్లు వసూలు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. మొదటి ఐదు రోజుల్లోనే ఈ మూవీ రూ.50 కోట్లకు పైగా షేర్‌ను సాధించింది.

నైజాంలో రూ.10.57 కోట్లు, సీడెడ్ రూ.9.99 కోట్లు, నెల్లూరులో రూ.2.39 కోట్లు, గుంటూరులో రూ.5.60 కోట్లు, కృష్ణాలో రూ.2.85 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.3.25 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.3.49 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.4.89 కోట్లు వసూలు చేసింది. అయితే, ఈ సినిమాకి అమెరికాలో గట్టి దెబ్బే తగిలింది. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ 3 లక్షల డాలర్లు వసూలు చేసినట్టు సమాచారం. అంటే దాదాపు రూ.2 కోట్ల వరకూ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *