కోలీవుడ్ హీరో అజిత్ నటించిన ‘ విశ్వాసం ‘ చిత్రం ట్రైలర్ ఆదివారం విడుదలైంది. శివ దర్శకుడు. యాక్షన్ సన్నివేశాల్లో అజిత్ అదరగొట్టగా, హీరోయిన్ నయనతార పల్లెటూరి పిల్లగా అలరించింది. సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీని త్యాగరాజన్ సమర్పిస్తున్నారు. జగపతిబాబు, సత్యరాజ్, ప్రభు గణేశన్ కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి ఇమాన్ సంగీత దర్శకుడు. ‘ వివేకం ‘ తరువాత అజిత్ నటించిన సినిమా ఇది. అలాగే అజిత్, శివ కాంబోలో తెరకెక్కిన నాలుగో మూవీ కూడా ! గతంలో వీరి కాంబినేషన్ లో ‘ వీరం ‘, ‘వేదాలం ‘, ‘ వివేగం ‘ సినిమాలు వచ్చాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *