‘అత్యంత సౌమ్యుడిగా పేరున్న మా చిన్నాన్నను దుర్మార్గంగా చంపేశారు.. ఇది నీచ రాజకీయ చర్య’ అని నేరుగా అధికార పార్టీ మీద అభియోగం మోపారు ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ‘దర్యాప్తు చేస్తున్న తీరు దారుణంగా వుంది.. బాధ కలిగిస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు జగన్. మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ నుంచి పులివెందుల చేరుకున్న జగన్.. ఘటనపై అనేక సందేహాల్ని వ్యక్తం చేశారు.

  • నా తండ్రిని రాజకీయాల్లో తిరక్కుండా ఉండేందుకు తాత (రాజారెడ్డి)ని చంపించారు.
  • తర్వాత నా తండ్రి (వైఎస్ రాజశేఖర్ రెడ్డి)ని కూడా చంపించారు. ఇప్పటికీ మాకు డౌట్ గానే వుంది.
  • చివరకు నన్ను కూడా విశాఖ ఎయిర్ పోర్ట్ లో చంపడానికి ప్లాన్ చేశారు..!
  • తాతను చంపినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబే, అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానన్నదీ చంద్రబాబే, నాపై హత్యాయత్నం, బాబాయ్ హత్య కూడా బాబు హయాంలోనే జరిగాయి.
  • నాన్నను అసెంబ్లీకి రాకుండా చేస్తానన్న చంద్రబాబు స్టేట్మెంట్ ని అప్పట్లో ఈనాడు పేపర్ ప్రముఖంగా రాసింది.
  • నాన్న చనిపోయిన నాటి హెలికాఫ్టర్ ఘటనపై దర్యాప్తు చేసిన సీబీఐ అధికారి లక్ష్మీనారాయణ.. అది ఒట్టి ప్రమాదమేనని తేల్చారు.
  • ఇప్పుడు మా చిన్నాన్నను ఒక పద్ధతి ప్రకారం కుట్ర చేసి హతమార్చారు. బెడ్ రూమ్ లో చంపి బాత్ రూమ్ లోకి ఈడ్చుకెళ్లి సీన్ క్రియేట్ చేశారు!
  • తప్పుడు లెటర్ రాసి డ్రైవర్‌ని ఇరికించే ప్రయత్నం చేశారు. హంతకుల సమక్షంలో చనిపోతున్న వ్యక్తి ఎలా లెటర్ రాస్తాడు?
  • ఎస్పీ నాతో మాట్లాడుతుండగానే రెండుమూడు సార్లు అడిషనల్ డీజీ (ఇంటిలిజెన్స్) వెంకటేశ్వర రావు నుంచి ఫోన్ వచ్చింది. ఏం మాట్లాడారు?

తన కుటుంబం మొత్తంమీద తెలుగుదేశం ప్రభుత్వం పగబట్టిందని ఆరోపించారు జగన్. నిజాలు బైటికిరావాలంటే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. వైఎస్ అభిమానులు సంయమనంతో ఉండాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *