పెళ్లి మాత్రమే కాదు రిసెప్షన్‌ని వైభవంగా చేస్తున్న రోజులివి. అందులో చిన్నచిన్న లోటుపాట్లు వున్నా ఇరు ఫ్యామిలీలు సర్దుకు పోవడం సహజం. ఇక్కడ గొడవకు పెద్దగా తావుండదు. రీసెంట్‌గా కొత్తగా పెళ్లైన ఓ జంట తమ వెడ్డింగ్ రిసెప్షన్‌ని న్యూఢిల్లీ జనక్‌పురి ప్రాంతంలోని పిక్కాడిలీ హోటల్‌లో ఏర్పాటు చేసింది. దీనికి ఇరుకుటుంబాల సభ్యులు, ఫ్రెండ్స్, వాళ్లవాళ్ల కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు హాజరయ్యారు.

హాయిగా నవ్వుతూ సాగాల్సిన వెడ్డింగ్ ఫంక్షన్ కాస్తా ఫైట్ క్లబ్‌గా మారిపోయింది. గెస్టులకు వడ్డించాల్సిన ఫుడ్‌లో క్వాలిటీ లోపించిందంటూ… హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. సిబ్బంది నుంచి వచ్చిన రిప్లై సరిగా లేకపోవడంతో వాళ్లపై దాడికి దిగారు. సిబ్బందిని కిందపడేసి కొట్టడమేకాదు ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *