టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రెస్ మీట్ పెట్టిమరీ విమర్శలకు దిగారు ప్రముఖ నటుడు మోహన్ బాబు. విద్యావ్యవస్థకు సంబంధించి ఏపీ సీఎం పనితీరు చాలా దారుణంగా ఉందన్నారు. ఒక విద్యాసంస్థ ఉన్నతమైన ప్రమాణాలు పాటించాలంటే ఎన్నో కావాలన్నారు. వీటన్నిటికీ డబ్బు కావాలని ఆయన అన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీ రీయింబర్స్ మెంట్ ప్రోగ్రామ్ పెట్టారని అయితే, దీనిని అమలు చేయడంలో ఏపీ సర్కారు సరైన ప్రోత్సాహం ఇవ్వడంలేదని ఆయన ఆరోపించారు.

సకాలంలో ఫీ రీయింబర్స్ మెంట్ సొమ్ములివ్వకుండా  అప్పుడప్పుడూ బిక్షమేసినట్టు నిధులు ఇస్తున్నారని విమర్శించారు. తమ విద్యాసంస్థలకు రావాల్సిన నిధులు, సకాలంలో రాకపోతే, తాము విద్యాసంస్థల్ని ఎలా నిర్వహించాలంటూ ఆయన చంద్రబాబు సర్కారు మీద ప్రశ్నలు సంధించారు. నా విద్యార్థులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉందన్నారు. దీనికి సంబంధించి చంద్రబాబుకు ఎన్ని ఉత్తరాలు రాసినా రిప్లై లేదంటూ విమర్శించారు. ఇప్పటికైనా తమకు రావాల్సిన సొమ్ములు ఇవ్వకపోతే, తన నెక్స్ట్ స్టెప్పేంటో చూస్తారంటూ చంద్రబాబుకి వర్నింగ్ ఇచ్చారు మోహన్ బాబు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *