క్యాస్టింగ్ కౌచ్ వివాదం రేగిన‌పుడు వినిపించిన రెండు పేర్లు.. శ్రీరెడ్డి, మాధ‌వీల‌త‌. శ్రీరెడ్డి ఓవ‌ర్‌నైట్‌లో పబ్లిసిటీ తెచ్చుకొంది. వివాదాల‌తో సంచ‌ల‌నం రేపింది. మాధ‌వీల‌త కూడా హీరో నానికి వ్య‌తిరేకంగా కొన్ని కామెంట్స్ చేసి వార్త‌ల్లో నిలిచింది. తెలుగు అమ్మాయిల‌కి టాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు అవ‌కాశాలు ఇవ్వ‌రు అనే అంశాన్ని బాగా ఎక్స్ పోజ్ చేసింది. ఎర్ర‌గా, బుర్ర‌గా ఉండే నార్త్ బ్యూటీసే వాళ్ల‌కి న‌చ్చుతార‌ని విమ‌ర్శించింది. త‌న వాగ్ధాటితో అంద‌ర్నీ ఎట్రాక్ట్ చేసి బీజేపీలో చేరి.. ఇపుడు ఏకంగా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొంది.

మ‌రి శ్రీరెడ్డికి ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వడానికి ముందుకు రాలేదెందుకు? ఆమె త‌న ఫేస్‌బుక్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి వ్య‌తిరేకంగా తరచూ పోస్ట్‌లు పెడుతోంది. జ‌న‌సేన‌కి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తుంది. ఐతే.. విచిత్రంగా ఇటు తెలుగుదేశం పార్టీకి, అటు జ‌గ‌న్ పార్టీకి మ‌ద్ద‌తుగా పోస్ట్‌లు పెడుతుంటుంది శ్రీరెడ్డి. ఐనా కూడా ఏ పార్టీ నుంచి ఈ మాట‌ల బాంబుకి ఇంకా పిలుపు రాలేదు. నిజంగా ఆమెకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే.. ఆమె చేసే ర‌చ్చ ఎలా ఉంటుందో? ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆమె ‘అడల్ట్స్ ఓన్లీ’ తిట్ల‌కి త‌ట్టుకుంటుందా?

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *