2014 ఎన్నికల్లోనూ, 2016 లో జరిగిన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లోను తెరాసకు బాసటగా నిలిచిన ఎంఐఎం.. ఈ ఎన్నికల్లో సైతం కేసీఆర్ కు మద్దతునిస్తోంది. ముస్లిముల ఓట్లు టీఆర్ఎస్ కువరంగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంఐఎం సపోర్టు తో తాము ఎన్నికలకు వెళ్తామని తెరాస ప్రకటించాక.. ఇటు  కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి, అటు బీజేపీ..వ్యూహాత్మకంగా తెరాసను టార్గెట్ చేశాయి. టీఆర్ఎస్ కు  ఓటు వేస్తే బీజేపీకి  వేసినట్టేనని కూటమి నేతలు ముస్లిం నియోజకవరగాల్లో ప్రచారం చేస్తున్నారు. అయితే ముస్లిం రిజర్వేషన్ కోటాను తాము 12 శాతానికి పెంచదలిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డు పడిందని టీ ఆర్ ఎస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. ( ముస్లిం రిజర్వేషన్ బిల్లును తెరాస ప్రభుత్వం నాడు అసెంబ్లీలో ఆమోదించి కేంద్ర ఆమోదానికి పంపిన విషయం గమనార్హం). ముస్లిం ఓట్ల శాతాలను పరిశీలిస్తే.. హైదరాబాద్ పాత బస్తీలోని బహదూర్ పురలో 90 శాతం ఉండడం విశేషం. అలాగే.. జహీరాబాద్ లో 30, బోధన్ లో 28, సంగారెడ్డిలో 21, మహేశ్వరంలో 23, ఆదిలాబాద్ లో 20,  తాండూరులో 17, ఖమ్మం, కుత్బుల్లా పూర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి లో 13 శాతం చొప్పున, నల్గొండ, కోరుట్లలో 12 శాతం చొప్పున, ఆర్మూర్, జుక్కల్, ఆందోల్, కామారెడ్డిలో  11 శాతం చొప్పున ముస్లిం  ఓట్ల శాతాలు ఉన్నట్టు ఓ విశ్లేషణలో తేలింది. బీజేపే సంగతి అలా ఉంచి.. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి ఈ శాతాల్లో కొన్నింటినైనా కైవసం చేసుకుంటుందా  అన్నది చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *