అమెరికా వంటి దేశాల్లో సూర్యరశ్మితక్కువ.. పైగా ఆ దేశాల ప్రజలు ఎండ వేడిమిని భరించలేరు. ఎక్కువగా సూర్య కాంతికి ఎక్స్ పోజ్ అయితే వారి శరీరాలు చర్మ సంబంధ రుగ్మతలకు గురవుతాయి. కొంతమందికి స్కిన్ క్యాన్సర్ సోకినా సోకవచ్చు. మరికొందరు మెలనోమా వంటి వ్యాధుల బారిన పడతారు. పైగా ఇలాంటి రుగ్మతలకు గురైతే..వాటిని డయాగ్నైజ్ చేయడం కూడా డాక్టర్లకు కష్టమవుతోంది. అందుకే నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ రీసెర్చర్లు కొత్తగా ..’ మై స్కిన్ ట్రాక్ యూవీ సెన్సర్ ‘ అనే డివైజ్ ని అభివృద్ది పరిచారు.

అతి చిన్నదైన ఈ సెన్సర్ ముఖ్యంగా స్కిన్ క్యాన్సర్ లక్షణాలను ట్రాక్ చేయగలదట. దీన్ని నెక్లెస్ లేదా చైన్ వంటి వాటిలో అమర్చుకోవచ్చునని. ఇది సన్ ఎక్స్ పోజర్ వల్ల కలిగే దుష్ఫలితాలను ఎనలైజ్ చేయగలదని అంటున్నారు. 60 డాలర్లకు లభించే ఈ అతి సూక్ష్మ పరికరం.. వల్ల..సోరియాసిస్, ఇతర చర్మ వ్యాధులను కూడా గుర్తించవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. మొదట ఈ పరికరంపై ప్రజల్లో అవగాహన పెరగాలని, దీన్ని వాడినప్పుడు తమ శరీరంలో ఏవైనా మార్పులు వంటివి కలిగితే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. అమెరికాలో 1999 లో 40, 777 మెలనోమా కేసులురిజిస్టర్ అయితే..2016 నాటికి ఇది 80, 442 కేసులకు పెరిగి పోయిందట. కేవలం ఓ చినుకు బరువు అంత మాత్రమే ఉండే ఈ సెన్సర్కు సంబంధించి మరిన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *