కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎట్టకేలకు జూలు విదిల్చింది. మోదీ సర్కార్‌కి బానిసలా పనిచేస్తోందంటూ విమర్శలు ఎదుర్కొంటున్న క్రమంలో ఈసీ.. తన పవరేంటో ప్రూవ్ చేసుకుంది. ఇద్దరు యూపీ ముఖ్యమంత్రుల్ని ‘శిక్షించింది’. యోగి ఆదిత్యనాధ్ మూడు రోజులు, మాయావతి రెండు రోజులు ప్రచారంలో పాల్గొనరాదని తేల్చి చెప్పింది. ఉత్తర్వులు విడుదలైన వెంటనే శిక్షలు అమల్లోకి వచ్చేస్తాయి. వీళ్ళు బహిరంగసభలు, ర్యాలీల్లో పాల్గొనడంపై నిషేధం ఉంటుంది.

ఘజియాబాద్ పబ్లిక్ మీటింగ్‌లో యోగి ఆదిత్యనాధ్ చేసిన అభ్యతరకర వ్యాఖ్యల వల్లే ఈ పరిణామం చోటుచేసుకుంది. ‘కాంగ్రెస్ వాళ్ళు టెర్రరిస్టులకు బిరియానీ పెడితే.. మన మోదీ సేనలోని జవాన్లు మాత్రం మిలిటెంట్లకు బుల్లెట్లు, బాంబులు ఇస్తున్నారు.” అంటూ యోగి చేసిన కామెంట్స్ కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఇండియన్ ఆర్మీని మోదీ ఆర్మీగా వ్యవహరించడం ఏమిటంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈసీ ఈ మేరకు స్పందించింది. సో.. మరో 72 గంటల పాటు యోగి గారి మైకు మూసుకుపోయినట్లే. కీలకమైన ఎన్నికల సమయంలో ప్రచారంపై నిషేధం విధించడం కంటే పెద్ద శిక్ష రాజకీయ నాయకులకు మరొకటి ఉండదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *