రంగుల పండుగ..హోళీ వచ్చిందంటే చాలు ! చిన్నా, పెద్దా అంతా ఒకరిపై ఒకరు  ఉత్సాహంగా రంగులు చల్లుకుంటూ..కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తారు. పిల్లల తో బాటు పెద్దలూ చేసే హంగామా అంతా ఇంతకాదు. ప్రతి ఏడాదీ ఈ దేశంలో, ముఖ్యంగా ఉత్తరాదిలో ఈ పండుగను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఫెస్టివల్ నేపథ్యంలో దీన్ని హైలైట్ చేస్తూ వచ్చిన పాటలెన్నో.. మచ్చుకు బాలీవుడ్ చిత్రాల్లో  మెరిసిన రంగుల పాటల్లో కొన్ని..సిల్ సిలా చిత్రంలో  ‘రంగ్ బర్ సే’ , షోలేలో  ‘హోళీ కే దిన్’ , గైడ్ చిత్రంలో ‘ పియా తూసే నైనా లగే ‘ సాంగ్, ఆఖిర్ క్యో సినిమాలో  సాత్ రంగ్ మే , ఏ జవానీ హై దివానీ లో  బలం పిచికారీ , వంటి పాటలు ఇప్పటికీ పాపులర్ గానే ఉన్నాయి. యూత్ తో బాటు పెద్ద వాళ్ళు కూడా నేటికీ ఈ పాటల మాధుర్యాన్ని ఆస్వాదిస్తూనే ఉన్నారు. హోళీ ప్రాశస్త్యాన్ని, వినోదాన్ని మేళవిస్తూ..సాగిన సాహిత్య ‘ ఝరి ‘, మ్యూజిక్ మతాలూ, కులాలు, జాతులతో నిమిత్తం లేకుండా అందర్నీ పరవశుల్ని చేస్తూనే ఉన్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *