వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో రాయదుర్గంలో జగన్ రోడ్ షో నిర్వహించారు. ఐదేళ్లుగా చంద్రబాబు మోసాలు చేస్తూనే ఉన్నారని.. తాము అధికారంలోకి వస్తే బెల్టు షాపుల బెండు తీస్తానని హామీ ఇస్తున్నానన్నారు. పాదయాత్రలో రైతుల కష్టాలు, డ్వాక్రా మహిళలు ఆవేదన తెలుసుకున్నానని చెప్పారు. ప్రతి ఒక్కరికి భరోసా కల్పించేలా వైసీపీ మేనిఫెస్టో ఉంటుందన్నారు. పైన చూస్తే మండుతున్న ఎండను ఏమాత్రంలెక్క చేయకుండా ప్రజలు తన పర్యటనలో బ్రహ్మరథం పట్టడం సంతోషకరమని జగన్ ఈ సందర్భంగా అన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *