వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న పరమేశ్వర్‌‌రెడ్డిని సిట్ అధికారులు సోమవారం రాత్రి తిరుపతిలో అరెస్ట్ చేశారు. మంగళవారం ఆయనను సిట్ విచారించనుంది. వివేకా హత్య జరిగిన రోజు నుంచి పులివెందులలో కనిపించకుండా పోయాడు పరమేశ్వర్‌రెడ్డి. ఆయనపై రకరకాల వార్తల నేపథ్యంలో సోమవారం మీడియా ముందుకొచ్చాడు. వివిధ ఛానెళ్లతో ఆయన మాట్లాడిన తీరుని గమనించిన సిట్, అనుమానం వ్యక్తంచేస్తోంది.

గుండె వ్యాధి సమస్యతో పరమేశ్వర్‌‌రెడ్డి తిరుపతిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకున్నట్లు సోమవారం ఉదయం అధికారులు గుర్తించారు. ఆయనపై వస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన కుటుంబం, వివేకా హత్య కేవలం ఇంటి దొంగల పనేనంటూ ఆరోపించారు. వివేకా హత్యతో తమకు సంబంధం లేదని, పోలీసులు నిజానిజాలు తేల్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *