వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త కోణం బయటపడింది. ఆయన హత్య కేసు అనుమానితుల జాబితాలో పరమేశ్వరెడ్డి పేరు బయటకువచ్చింది. ఇప్పటికే ఏడుగురు అనుమానితులు పోలీసుల అదుపులో వున్నారు. తాజాగా పులివెందులకు సమీపంలోవున్న కసునూరి ప్రాంతానికి చెందినవాడు పరమేశ్వర్‌రెడ్డి. ఎక్కువగా భూవివాదాలు, సెటిల్‌మెంట్స్ చేసేవాడు. ఈయనపై చిన్నచిన్న కేసులున్నాయి. అంతేకాదు వివేకానందకు అత్యంత సన్నిహితుడు కూడా!

కొద్దిరోజుల కిందట ఓ భూవివాదంలో వివేకాతో ఆయన గొడవపడినట్టు తెలుస్తోంది. త్వరలో పులివెందులలో ఓ సంచలనం చూస్తారని పరమేశ్వర్‌రెడ్డి తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం. ఐతే, హత్య జరిగి మరుసటి రోజు నుంచి పరారీలోనే వున్నాడట పరమేశ్వర్‌రెడ్డి. ఈ కేసులో ఆయన ప్రమేయం ఏమైనావుందా? అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు.

ఆదివారం నుంచి పరమేశ్వర్‌పైనే ఫోకస్ చేశారు పోలీసులు. ఇతని కోసం వేట మొదలుపెట్టారు. పరమేశ్వర్‌రెడ్డి గురించి వివేకా కుటుంబసభ్యులకు తెలిసే వుంటుందని, ఆయన గురించి పోలీసులకు చెప్పకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. మరోవైపు తనపై అనేక వార్తలు రావడంతో పరమేశ్వర్‌రెడ్డి మీడియా ముందుకొచ్చాడు. ఈ కేసును రాజకీయ కుట్ర కోసం వాడుకుంటున్నారని అన్నాడు. తనకు గుండె సమస్య వుండడంతో తిరుపతిలో ట్రీట్‌మెంట్ తీసుకున్నట్టు తెలిపాడు. వివేకా హత్య కేవలం ఇంటి దొంగల పనే అని చెప్పారు. వివేకాతో తనకు 20 ఏళ్ల స్నేహం వుందని, చూడటానికి వెళ్లలేదని తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *