తమకు అంతసీన్ లేదని చెబుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమతో పొత్తుకోసం రాయబారులను ఎందుకు పంపిస్తోందని ప్రశ్నించిన జనసే అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పవన్‌ కల్యాణ్‌ ను వైసీపీతో కలవమని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరో తమకు చెప్పాలని వైసీపీ నేత, మాజీ మంత్రి పార్థసారథి డిమాండ్ చేశారు. పవన్‌కు వైసీపీతో కలిసి పనిచేయాలన్న కోరిక ఉన్నట్లు ఉందని, అందుకే అలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరి సహకారం తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు మానసికంగా ఓటమికి సిద్దమై.. జగన్‌ చేపడతానన్న పధకాలను కాపీ కొడుతున్నారన్నారు.

అటు వైసీపీ మరో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా పవన్ పైనా చంద్రబాబుపైనా విమర్శలు చేశారు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే ఆత్రం పవన్ కల్యాణ్ లో కనిపిస్తోందని బొత్స అన్నారు. ముందు జనసేనకు టీడీపీతో సంబంధాలు ఉన్నాయో, లేదో తేల్చి చెప్పాలన్నారు. జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని తప్పుబడుతూ చంద్రబాబు లేఖ రాయం సరికాదని బొత్స అన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *