వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేసింది. అనంతరం ఆపార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. జగన్‌, పార్టీ కోర్ కమిటీ అన్ని రకాలుగా చర్చించి ఏపీలోని 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసినట్లు వెల్లడించారు. మంచి ముహుర్తం అని చెప్పడంతో ఇవాళ తొమ్మిదిమందితో తొలి జాబితా, మిగిలిన స్థానాలను రేపు ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రకటిస్తారని తెలిపారు. ఇక, ప్రస్తుతం ప్రకటించిన తొమ్మిది మంది లోక్ సభ అభ్యర్థుల జాబితాలో గత ఎన్నికల్లో విజయం సాధించిన పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చారు. ఇద్దరు మహిళలకు స్థానాలు దక్కాయి. కులాల ప్రాతిపదికన చూస్తే.. రెండు ఓసీ, ఒక ఎస్టీ, మూడు బీసీ, మూడు ఎస్సీ అభ్యర్థుల ఈ జాబితాలో ఉన్నారు. అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

అరకు – గొడ్డేటి మాధవి
అమలాపురం- చింతా అనురాధ
రాజంపేట- పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి
కడప- వైఎస్‌ అవినాష్‌ రెడ్డి
హిందుపురం – గోరంట్ల మాధవ్
అనంతపురం – తలారి రంగయ్య
బాపట్ల – నందిగం సురేష్‌
చిత్తూరు- నల్లకొండగారి రెడ్డప్ప
కర్నూలు – డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *